World cup finals: ఆస్ట్రేలియా 450/2, ఇండియా 65కే ఆలౌట్.. ఫైనల్స్‌పై కొన్నాళ్ల క్రితం మిచెల్ మార్ష్ చేసిన వ్యాఖ్యలు వైరల్

  • గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజ్ పాడ్‌కాస్ట్‌లో మిచెల్ మార్ష్ వ్యాఖ్య
  • నాటి వ్యాఖ్యలు మళ్లీ వైరల్, భారత అభిమానుల్లో ఆగ్రహం
  • ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం తప్పదంటూ నెట్టింట హెచ్చరికలు
Australia 450 for 2 India 65 all out Mitchell Marshs bold World Cup final prediction

అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంతా సిద్ధమైంది. మేటి టీం ఆస్ట్రేలియాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోబోతోంది. టీమిండియాను విజయం వరిస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. కానీ, మ్యాచ్ ఫలితం మరోలా ఉండబోతోందంటూ ఆసిస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇవి అభిమానులకు కోపం తెప్పించడంతో పాటూ కాస్తంత టెన్షన్ కూడా పెడుతున్నాయి. 

ఇప్పటివరకూ ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు అవమానకర ఓటమి తప్పదని మే నెలలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో మిచెల్ మార్ష్ జోస్యం చెప్పాడు. ‘‘అజేయ ఆస్ట్రేలియా, ఓటమి భారంతో ఇండియా, ఆస్ట్రేలియా 450/2, ఇండియా 65 పరుగులకే ఆలౌట్’’ అంటూ మ్యాచ్ ఫలితాన్ని నాలుగు ముక్కల్లో తేల్చేశాడు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. 

2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్.. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో తలపడింది. అప్పట్లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే, ఈసారి భారత్ తనని తాను దుర్భేద్యమైన జట్టుగా నిరూపించుకుంది. ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన టీమిండియా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మింగ్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కాబట్టి, ఈసారి ఆసిస్ ఆటలు సాగవని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.

More Telugu News