నేను హెలికాప్టర్లో రావడానికి కారణం వారే... రేపు వారే ఓనర్లు అవుతారు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ఉద్యోగులు, పోలీసులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్న బీఎస్పీ తెలంగాణ చీఫ్
- దొరల గడీలను కూలుస్తామన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- అన్ని కులాలకు సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీయే అన్న ఆర్ఎస్పీ
బీర్లు క్వార్టర్లు మా పేదలకు పంచి... డబ్బులు, పదవులు మీకా? అని నిలదీశారు. కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రోడ్డెక్కితే ప్రజలు రాళ్లతో కొడతారన్నారు. కేసీఆర్ను ఈ ఎన్నికల్లో గద్దె దించాలన్నారు. కోయ, లంబాడి చిరు ఉద్యోగులు ఇచ్చిన విరాళాలతో హెలికాప్టర్లో తాను వస్తున్నానని, రేపటి రోజున బహుజనులే హెలికాప్టర్లకు ఓనర్లు అవుతారన్నారు.