Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షమీ సూపర్ 'సెవెన్'... ఢిల్లీ, ముంబయి పోలీసుల మధ్య సరదా సంభాషణ

Delhi and Mumbai police funny tweets after Mohammed Shami super seven against New Zealand in semis
Advertisement
  • వరల్డ్ కప్ లో వికెట్ల వీరుడిగా దూసుకుపోతున్న షమీ
  • నిన్న న్యూజిలాండ్ పై సెమీస్ లో 7 వికెట్లతో రికార్డు
  • ఫన్నీ ట్వీట్లతో ఆకట్టుకున్న ఢిల్లీ, ముంబయి పోలీస్ విభాగాలు
Advertisement
టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమీ వరల్డ్ కప్ వికెట్ల వేట సాగిస్తున్నాడు. బుధవారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో షమీ 7 వికెట్లతో రికార్డు సృష్టించాడు. గెలుపు దిశగా వెళుతున్న న్యూజిలాండ్ కు కళ్లెం వేశాడు. కాగా, షమీ సూపర్ 'సెవెన్'పై ఢిల్లీ, ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో సరదాగా సంభాషించుకున్నారు. పోలీసు పరిభాషలో సాగిన ఈ సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ట్వీట్లు ఇలా సాగాయి...

ఢిల్లీ పోలీస్ విభాగం: ఈ రాత్రి షమీ సాగించిన దాడులకు అతడ్ని మీరు అరెస్ట్ చేయరనే అనుకుంటున్నాం. 
ముంబయి పోలీస్ విభాగం: లెక్కలేనన్ని హృదయాలను దొంగలించినందుకు అతడిపై మీరు అభియోగాలు మోపడం మర్చిపోయినట్టున్నారు. అతడితో పాటు మరో ఇద్దరు సహనిందితులు (కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్)ల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు మీరు!

గమనిక: ప్రియమైన పౌరులారా... ఇది సరదా సంభాషణ మాత్రమే. రెండు డిపార్ట్ మెంట్లకు ఐపీసీ గురించి బాగా తెలుసు. మీలో మంచి హాస్య చతురత ఉందని నమ్ముతూ ఈ సంభాషణ చేశాం... అంటూ ముంబయి పోలీస్ విభాగం వివరణ ఇచ్చింది.
Advertisement
Advertisement
Mohammed Shami
Delhi Police
Mumbai Police
Semis
New Zealand

More Telugu News