నియంత్రణ కోల్పోయి భూవాతావరణంలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 లాంచ్ వెహికల్
- జులై 14న చంద్రయాన్ -3 ప్రయోగం
- నియంత్రణ కోల్పోయిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4లోని క్రయోజనిక్ పైభాగం
- బుధవారం 2.42 గంటలకు ఘటన
చంద్రయాన్-3ని ఈ ఏడాది జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ (ఐఏడీసీ) ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవితకాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది.