Atharva: మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే 'అథర్వ' .. ట్రైలర్ రిలీజ్!

  • కార్తీక్ రాజు హీరోగా రూపొందిన 'అథర్వ'
  • ఆయన జోడీకట్టిన సిమ్రన్ చౌదరి 
  • సంగీతాన్ని సమకూర్చిన శ్రీచరణ్ పాకాల 
  • ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్  

Atharva movie trailer released

ఈ మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. బడ్జెట్ సంగతి అటుంచితే చిన్న సినిమాలే అయినా మౌత్ టాక్ తో ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చే ఈ తరహా సినిమాలకి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
 
ఈ నేపథ్యంలో వస్తున్న మరో మర్డర్ మిస్టరీ కథనే 'అథర్వ'. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కార్తీక్ రాజు - సిమ్రన్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఒక హీరోయిన్ మర్డర్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఆమెతో పాటు సిటీలో మరో మూడు మర్డర్ లు జరుగుతాయి. ఈ హత్యలను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. థియేటర్స్  నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News