ODI World Cup: సెమీ ఫైనల్స్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. తుది జట్లు ఇవే!

Rohit Sharma won the toss and elected to bat first in fist semi finals against New Zealand
  • ముంబై వాంఖడే స్టేడియంలో ఫస్ట్ సెమీస్
  • న్యూజిలాండ్ తో తలపడుతున్న టీమిండియా
  • ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్న భారత్
వన్డే వరల్డ్ కప్ 2023తో తొలి సెమీఫైనల్స్ టీమిండియా - న్యూజిలాండ్ ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ... ఇది గుడ్ పిచ్ అని చెప్పాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. గొప్ప జట్లలో న్యూజిలాండ్ ఒకటని, ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని తెలిపాడు. ఈరోజు ఎవరు బాగా ఆడితే విజయం వారిదేనని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. 

తుది జట్లు:
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్. 

న్యూజీలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియంసన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్ మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంటర్న్, టిమ్ సౌథీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News

ODI World Cup
Semi Finals
Team India
Team New Zealand