చిన్నమ్మా పురందేశ్వరీ.. జాతీయ నేతగా ఉండి జాతి నేతగా ఎందుకు మారారు?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy satires on Purandeswari
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. 'చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు 'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు?' అని ఆయన ఎద్దేవా చేశారు. మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న బీజేపీ నుంచి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా అని దెప్పిపొడిచారు.  

రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్న చిన్నచిన్న నేతలు కూడా ఎంతో నిజాయతీగా అన్ని చోట్ల పోటీచేశారని... ఆ పని మీరెందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. మీ పార్టీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెపుతారని అడిగారు. కొంపదీసి 'మా బావ కళ్లల్లో ఆనందం కోసం' అని నిజం చెబుతారా? అని ఎద్దేవా చేశారు. ఇదే కదా మీకు మీ పార్టీపై ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. వెనకటికి ఒకామె... ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట అని సెటైర్ వేశారు. 

Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Daggubati Purandeswari
BJP

More Telugu News