మీకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చా!: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి
- కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పండే పంట క్వింటాల్ రూ.4వేలకు పైగా విక్రయిస్తున్నారని వెల్లడి
- కామారెడ్డి రైతుల వరిని క్వింటాల్ రూ.2వేల లోపు ఎందుకు కొంటున్నారన్న రేవంత్
ఆత్మహత్యలు చేసుకున్న యువత, రైతులను చూసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు రావడం లేదని విమర్శించారు. అందుకే మీకు అండగా ఉండేందుకు వచ్చానని చెప్పారు. కామారెడ్డి ప్రజల భూములను కాపాడే బాధ్యత తనదే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో పండించిన వడ్లను క్వింటాల్‌కు రూ.4వేలకు పైగా అమ్ముకుంటున్నారని, కానీ కామారెడ్డి రైతుల వరిని క్వింటాల్ రూ.2వేల లోపు ఎందుకు కొంటున్నారని నిలదీశారు.