తనలాగే ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
- అచ్చం ఆనంద్ మహీంద్రాలా ఉన్న వ్యక్తి
- ఫొటో పోస్టు చేసిన ఓ నెటిజన్
- బహుశా తాము చిన్నప్పుడే విడిపోయి ఉంటామంటూ ఆనంద్ చమత్కారం
దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. అంతేకాదు, తనదైన శైలిలో ఆ ఫొటోపై వ్యాఖ్యానించారు. "చూస్తుంటే మేం ఎప్పుడో విడిపోయినట్టున్నాం. బహుశా మా చిన్నతనంలో ఏదో తిరునాళ్లలో తప్పిపోయి ఉంటాం" అని చమత్కరించారు. కాగా, ఈ ఫొటోపై నెటిజన్లు కూడా తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.