Shankar: సూర్య - కార్తి హీరోలుగా శంకర్ సినిమా!

  • భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శంకర్ 
  • మల్టీ స్టారర్ సినిమాకు ఆయన టీమ్ సన్నాహాలు
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న సినిమా
  • సూర్య - కార్తి కెరియర్లో ఈ ప్రాజెక్టు ప్రత్యేకం  

 Shankar Multi Starrer Movie

సూర్య - కార్తి సోదరులు ఇద్దరూ కూడా తమిళనాట స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగులోను ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరికీ కూడా ఈ విషయంపై ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఎదురయ్యాయి. సరైన కథ దొరికితే చేస్తామని చెబుతూ వచ్చారు. 

ఇప్పుడు అలాంటి ఒక కథను శంకర్ టీమ్ రెడీ చేస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. సూర్య - కార్తి కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన ఈ కాంబినేషన్ ను సెట్ చేసుకుని, అందుకు తగిన కథను శంకర్ రెడీ చేయిస్తున్నాడని అంటున్నారు. ఆ దిశగా గట్టి కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. 

ఇటు సూర్య .. అటు కార్తి ఇమేజ్ కి తగినట్టుగా ఆ పాత్రలను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' .. 'గేమ్ చేంజర్' సినిమాలతో బిజీగా ఉన్న శంకర్, ఆ తరువాత చేయనున్న సినిమా ఇదేనని అంటున్నారు.

More Telugu News