Breathalyzer Test: ఓటేసే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలి.. ఈసీకి సరికొత్త విజ్ఞప్తి

  • మద్యం మత్తులో ఓటేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలని డిమాండ్
  • ఎలక్షన్ కమిషన్ కు డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
Drunker Welfare Association Requests Election Commission To Conduct Breathalyzer Test Outside Polling Station

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో ప్రతీ పోలింగ్ బూత్ ముందు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని, మద్యం తాగలేదని నిర్ధారణ అయ్యాకే ఓటేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది. మద్యం మత్తులో ఎవరికి ఓటేస్తున్నామో తెలియని స్థితిలో ఓటు హక్కు వినియోగించకోనీయ వద్దని ఈసీకి వినతి పత్రం అందజేసింది. 

ఐదేళ్ల భవిష్యత్తును ఓటర్లు మద్యం మత్తులో నాశనం చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. నవంబర్ 30న ప్రతి పోలింగ్ స్టేషన్ బయట బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ వినతి పత్రం గురించి తెలిసినపుడు తొలుత ఆశ్చర్యపోయినా తర్వాత ఆలోచింపజేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినతిపత్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఓటు అనే ఆయుధాన్ని మద్యం మత్తులో వృథా చేసుకోవద్దని సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని అంటున్నారు.

.

More Telugu News