మల్లెలా విరిసిన మెహ్రీన్ .. లేటెస్ట్ పిక్స్!

Mehreen Special
  • గ్లామరస్ బ్యూటీ అనిపించుకున్న మెహ్రీన్
  • వరుస హిట్లతో అలరించిన నాయిక
  • ఈ మధ్య కాలంలో వచ్చిన గ్యాప్ 
  • త్వరలో విడుదల కానున్న 'స్పార్క్'  

టాలీవుడ్ కి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. చక్కని మేనిఛాయ .. విశాలమైన కళ్లు ... మనసును దోచేసే చూపులు మెహ్రీన్ సొంతం. సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే హిట్ కొట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అలాంటిది మెహ్రీన్ మాత్రం వస్తూనే వరుసగా మూడు సక్సెస్ లను అందుకుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తన జోరు చూపించడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అలాగే ఆమె వరుస సినిమాలతో తన కెరియర్ ను పరిగెత్తించింది. అయితే 'ఎఫ్ 2' ... 'ఎఫ్ 3' మినహా పెద్దగా హిట్లు ఆమె ఖాతాలోకి చేరలేకపోయాయి. మెహ్రీన్ చేసిన 'స్పార్క్' సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన లేటెస్ట్ పిక్స్ కుర్రాళ్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. వైట్ కలర్ డ్రెస్ లో మంచులో పూసిన మల్లెలా కనిపిస్తోంది .. పాలరాతి శిల్పంలా మెరుస్తోంది. ఈ సుందరి కెరియర్ గ్రాఫ్ మళ్లీ పుంజుకుంటుందేమో చూడాలి. 


Advertisement
Mehreen
Actress
Tollywood

More Telugu News