మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోడలు

Komatireddy daughter in law in elections campaign
  • రాజగోపాల్ రెడ్డికి ఉన్న మంచి పేరే గెలిపిస్తుందని ధీమా
  • రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, గెలుపు ఖాయమన్న రాజగోపాల్ రెడ్డి కోడలు
  • తమ పెద్ద మామయ్య వెంకటరెడ్డి కూడా నల్గొండ నుంచి గెలుస్తారని విశ్వాసం
మునుగోడు నుంచి తన మామయ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారని ఆయన కోడలు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మామయ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ మంచి పేరు ఉందని, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అందరిని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసిందన్నారు. ఈసారి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. రాజగోపాల్ రెడ్డిది మొదటి నుంచి అందరికీ ఎంతో సాయం చేసే గుణమని, ఇది అందరికీ తెలిసిందే అన్నారు. ప్రజలంతా రాజగోపాల్ రెడ్డికే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి అని, మంచి చేసిన వారికి మంచే జరుగుతుందన్నారు.

సంకీర్త్ రెడ్డి తన తండ్రి రాజగోపాల్ రెడ్డికి తోడుగా ఉంటున్నారన్నారు. ఐటీ, మీడియా, సోషల్ మీడియాను సంకీర్త్ రెడ్డి చూసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తోందని, తమ గెలుపు ఖాయమన్నారు. తాము గడప గడపకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తన మామయ్య రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, అలాగే తమ పెద్ద మామయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ నుంచి కచ్చితంగా గెలుస్తారన్నారు. తమ ఇద్దరు మామయ్యలకు తాము అండగా ఉంటామని, వారిని గెలిపిస్తామన్నారు.
Go Back to Shorts
Komatireddy Raj Gopal Reddy
Komatireddy Venkat Reddy
Congress
Munugode

More Telugu News