రేపు పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు
- తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన చంద్రమోహన్
- సోమవారం ఉదయం అంత్యక్రియలు
- అమెరికాలో ఉంటున్న పెద్ద కుమార్తె
- ఈ రాత్రికి ఆమె హైదరాబాద్ చేరుకోనున్న వైనం
ఈ క్రమంలో, సోమవారం ఉదయం హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రమోహన్ నివాసం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. మధ్యలో తెలుగు ఫిలిం చాంబర్ వద్ద కొద్దిసేపు ఆపుతారని వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తలను చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఖండించారు. పరిశ్రమలో ఉన్నవారు చాలామంది ఇంటికే వచ్చి నివాళులు అర్పించారని, ఇప్పటికే రెండ్రోజుల సమయం గడిచిందని, అందువల్ల నేరుగా శ్మశానవాటికకు తరలిస్తున్నట్టు వారు వివరించారు.