Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీమిండియా ఆటగాళ్ల దీపావళి వేడుకలు.. ఫొటోలు ఇవిగో!

Team India Players And Staff Celebrate Diwali
Advertisement
  • భార్య అనుష్కతో కలిసి పాల్గొన్న కోహ్లీ
  • వేడుకలకు ఫ్యామిలీతో హాజరైన కెప్టెన్ రోహిత్
  • సంప్రదాయ దుస్తులలో సందడి చేసిన క్రికెటర్లు
Advertisement
వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Advertisement
Advertisement
Kohli Diwali
Team India
Diwali celebrations
Bengaluru hotel
Rohit Sharma
chinna swamy stadium
netherlands
worldcup 2023

More Telugu News