అల్లు అర్జున్ లాంటి నటుడిని నేను చూడలేదు: 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంటులో అజయ్ ఘోష్
- సందడిగా జరుగుతున్న 'మంగళవారం' ఈవెంట్
- 'పుష్ప' తరువాత తన లెక్కవేరన్న అజయ్ ఘోష్
- తనకి ఇంతటి పేరు రావడానికి బన్నీ కారణమని వెల్లడి
- తనని బన్నీ ప్రోత్సహించాడని వ్యాఖ్య
ఈ వేదికపై నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ .. "నేను చాలామంది హీరోలతో చేస్తున్నాను. నా గుండెల్లో గూడుకట్టుకున్న హీరోల్లో మొట్టమొదటివాడు అల్లు అర్జున్. 'పుష్ప'కి ముందు అజయ్ ఘోష్ వేరు .. 'పుష్ప' తరువాత అజయ్ ఘోష్ లెక్కవేరు. నాకు ఇంతటి పేరు రావడానికి కారకుడు సుకుమార్ .. అల్లు అర్జున్" అని అని అన్నారు.
"అల్లు అర్జున్ తెలుగువాడి సత్తాను నేషనల్ లెవెల్లో చాటిచెప్పాడు. అలాంటి నటుడిని ఇంతవరకూ నేను చూడలేదు. నటుల్లో ఎవరైనా నటించేవారుంటే ఆయన ఎంతగా ప్రోత్సహిస్తాడనడానికి నేనే ఉదాహరణ. అలాంటి అర్జున్ గెస్టుగా వస్తున్నాడంటే 'మంగళవారం' మరో లెవెల్లో ఉంటుంది" అంటూ చెప్పారు.