తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అన్న కేసీఆర్
- దీపాల వెలుగులు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాయన్న కేసీఆర్
- తెలంగాణ ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, ప్రతి ఇల్లు సిరిసంపదలతో విరాజిల్లాలని కోరుకున్న కేసీఆర్
మనలో అంతర్‌జ్యోతి వెలిగినప్పుడే జీవితంపై స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందన్నారు. మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకలశుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.