పాకిస్థాన్ తో మ్యాచ్.... ఇంగ్లండ్ కు శుభారంభం

Openers gives good start to England
  • వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ × పాకిస్థాన్
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లండ్ జట్టుది ఒక బాధాకరమైన గాథ! గత వరల్డ్ కప్ విజేతగా, బజ్ బాల్ క్రికెట్ తో గొప్ప అంచనాలను మోసుకుంటూ మెగా టోర్నీ బరిలో దిగిన ఇంగ్లండ్... తన స్థాయికి న్యాయం చేయడం అటుంచి, చిన్న జట్ల చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయింది. వరల్డ్ కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన ఇంగ్లండ్ ఇవాళ పాకిస్థాన్ తో ఆడుతోంది. 

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. మలాన్ 31, బెయిర్ స్టో 59 పరుగులు చేశారు. 

అయితే, మలాన్ ను ఇఫ్తికార్ అహ్మద్ అవుట్ చేయగా, జానీ బెయిర్ స్టోను హరీస్ రవూఫ్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 19 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు. జో రూట్ 8, బెన్ స్టోక్స్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
Advertisement
England
Pakistan
Eden Gardens
Kolkata
World Cup

More Telugu News