శ్రీనగర్ లోని దాల్ లేక్ లో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో!
- మంటల్లో కాలిపోయిన ఐదు హౌస్ బోట్లు
- శనివారం తెల్లవారుజామున ప్రమాదం
- ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదన్న అధికారులు
దాల్ లేక్ లోని ఘాట్ నెంబర్ 9 వద్ద నిలిపి ఉంచిన ఓ హౌస్ బోట్ లో తొలుత మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మిగతా బోట్లకు పాకాయని వివరించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.