బీఫాం ఇచ్చినా పత్తాలేని ఎంఐఎం అభ్యర్థి.. చివరి నిమిషంలో మరో అభ్యర్థి నామినేషన్
- రాజేంద్రనగర్ నుంచి రాజు యాదవ్‌ను బరిలోకి దింపిన ఎంఐఎం
- అధిష్ఠానానికి, కార్యకర్తలకు అందుబాటులోకి లేకుండా పోయిన అభ్యర్థి
- స్వామి యాదవ్‌తో నామినేషన్ వేయించిన పార్టీ
టికెట్ కేటాయించి బీఫాం ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ అధిష్ఠానానికి కానీ, కార్యకర్తలకు కానీ అందుబాటులో లేకుండా పోయారు. నామినేషన్ కూడా వేయకపోవడంతో గాభరా పడిన పార్టీ.. వెంటనే కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్‌కు బీఫాం ఇచ్చి నామినేషన్ దాఖలు చేయించి ఊపిరి పీల్చుకుంది.