టాలీవుడ్ లో సాహసాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ గారు: మంత్రి రోజా

Minister Roja hails Superstar Krishna
  • విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు
  • ఆవిష్కరించిన కమలహాసన్
  • కృష్ణ వెండితెరపై చెరగని ముద్ర వేశారన్న మంత్రి రోజా
విజయవాడలో ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది. లెజెండరీ నటుడు కమలహాసన్, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాహసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని కొనియాడారు. వెండితెరపై చెరగని ముద్ర వేసిన దివంగత కృష్ణ గారి విగ్రహాన్ని ఇవాళ విజయవాడ కేడీజీవో పార్క్ లో హీరో కమలహాసన్ గారు ఆవిష్కరించారని రోజా వెల్లడించారు. వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణ గారి అభిమానులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు.
Go Back to Shorts
Superstar Krishna
Roja
Statue
Kamal Haasan
Devineni Avinash
Vijayawada
YSRCP

More Telugu News