ఆనంద్ జీ.. మరి మీకు ఈ విషయం తెలుసా?... ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ రిప్లై!
- హైదరాబాద్‌లో గూగుల్ భారీ క్యాంపస్ ఏర్పాటుపై ఆనంద్ మహీంద్రా స్పందన
- దీనికి భౌగోళికరాజకీయ ప్రాధాన్యం ఉందని వ్యాఖ్య
- ఇతర దిగ్గజాల క్యాంపస్‌లూ హైదరాబాద్‌లో ఉన్నాయంటూ నగరం గొప్పదనాన్ని చాటిన వైనం
అయితే, హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోని మంత్రి కేటీఆర్ ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. ‘‘ఆనంద్ జీ.. మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అంతేకాదు, యాపిల్, మెటా, క్వాల్కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ వంటి ఎన్నో సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో తమ భారీ క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే..#HappeningHyderabad అని మేమనేది. అమెజాన్ క్యాంపస్‌ను ఫొటోను కూడా అటాచ్ చేశాను చూడండి’’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో, భాగ్యనగరం పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.