బుల్డోజర్లతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి
- పదుల సంఖ్యలో బుల్డోజర్లతో వచ్చిన అభ్యర్థి నందీశ్వర్ గౌడ్
- అందరినీ ఆకర్షించిన ర్యాలీ... నెట్టింట వీడియో వైరల్
- రేపటితో ముగియనున్న నామినేషన్ గడువు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు నామినేషన్ దాఖలు చేసేందుకు వినూత్నంగా వెళ్తున్నారని, పటాన్ చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ బుల్డోజర్లతో ర్యాలీ నిర్వహిస్తూ వచ్చి నామినేషన్ దాఖలు చేశారని ట్వీట్ చేశారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. నేడు మంచి రోజు కావడంతో చాలామంది ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.