భాగ్యనగరంలో నామినేషన్ల కోసం అభ్యర్థుల బారులు... భారీగా ట్రాఫిక్ జామ్
- రేపటి వరకే గడువు... నేడు మంచిరోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు
- భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయా పార్టీల అభ్యర్థులు
- ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల ఇబ్బందులు
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ తదితర పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, రోడ్డు షోలతో నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారు. దీంతో హైదరాబాద్‌లో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాస్త దూరం వెళ్లేందుకే గంటల సమయం పడుతోంది. కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కేబీఆర్ పార్క్ నుంచి పంజాగుట్ట మార్గంలోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మంచి రోజు కాబట్టి సీఎం కేసీఆర్ సహా పలువురు నేడే నామినేషన్ దాఖలు చేస్తున్నారు.