హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో తన మెజార్టీపై ఈటల రాజేందర్ వ్యాఖ్య

  • గజ్వేల్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు
  • రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు
  • ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు ఓటు ఏకే47 వంటిదన్న ఈటల
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈటల మాట్లాడుతూ... ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఓటు అనే ఆయుధం ఏకే47 వంటిదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. తనకు హుజూరాబాద్ కంటే గజ్వేల్‌లోనే అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను నామినేషన్ దాఖలు చేస్తానంటే వేలాదిమంది వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.

Etela Rajender
G. Kishan Reddy
gajwel
KCR
Telangana Assembly Election

More Telugu News