Cricket: ఫోర్త్ అంపైర్ నిర్ణయం తప్పు.. ‘టైమ్‌డ్ ఔట్’పై సాక్ష్యం చూపించిన ఏంజెలో మాథ్యూస్

  • హెల్మెట్ తీసుకునే సమయానికి 5 సెకన్లు మిగిలే ఉందని ఆవేదన
  • 'టైమ్‌డ్ ఔట్' నిర్ణయం తప్పిదమంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందన
  • సమయం గడిచిపోయాక మాథ్యూస్ వచ్చాడన్న ఫోర్త్ అంపైర్
Fourth umpire is wrong says Angelo Mathews

ప్రపంచ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో తనను 'టైమ్‌డ్ అవుట్'గా ప్రకటించడంపై ఏంజెలో మాథ్యూస్ స్పందించాడు. ఫోర్త్ అంపైర్ నిర్ణయం తప్పిదమని అభిప్రాయపడ్డాడు. ఇందుకు సంబంధించి తన వద్ద సాక్ష్యం ఉందంటూ ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశాడు. ‘‘ నా ఔట్ విషయంలో ఫోర్త్ అంపైర్ నిర్ణయం తప్పు! నాకు హెల్మెట్ అందించిన తర్వాత కూడా 5 సెకన్ల సమయం ఉందని వీడియో రుజువు చేస్తోంది. దయచేసి ఫోర్త్ అంపైర్ ఈ నిర్ణయాన్ని సరిదిద్దగలరా? ఆటగాడికి భద్రత చాలా ముఖ్యమని చెప్పడమే నా ఉద్దేశ్యం. హెల్మెట్ లేకుండా బౌలర్‌ను ఎదుర్కోలేను’’ అంటూ మాథ్యూస్ రాసుకొచ్చాడు.

కాగా షేర్ చేసిన ఫొటోలో సదీర సమరవిక్రమ ఔటయ్యాక రెండు నిమిషాల వ్యవధిలోనే మాథ్యూస్ క్రీజులోకి వచ్చినట్టుగా ఉంది. క్యాచ్ పట్టిన సమయం నుంచి హెల్మెట్ పట్టుకొని బయలుదేరిన సమయాన్ని ఇందులో పేర్కొన్నాడు. అయితే ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ అభిప్రాయం విభిన్నంగా ఉంది. మాథ్యూస్ తన హెల్మెట్ సమస్యను పరిష్కరించుకునేలోపే 2 నిమిషాలు గడిచిపోయాయని చెప్పాడు. ఒక బ్యాట్స్‌మెన్‌గా పరికరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ముందుగానే నిర్ధారించుకోవాలని, 2 నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హోల్డ్‌స్టాక్ పేర్కొన్నాడు.

More Telugu News