Virat Kohli: ఈడెన్‌గార్డెన్స్‌లో షారూఖ్ పాటకు స్టెప్పులేసిన కోహ్లీ.. ఉత్సాహంతో ఊగిపోయిన ప్రేక్షకులు

ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌తో దున్నేస్తున్న కోహ్లీ రికార్డులు తిరగరాస్తున్నాడు. గత రాత్రి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి 49వ వన్డే సెంచరీ సాధించి సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. పుట్టిన రోజునాడు శతకం బాది చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. మైదానంలో బ్యాట్‌తో అలరించే కింగ్ కోహ్లీ.. మైదానంలోని ప్రేక్షకులలో కూడా తన విన్యాసాలతో ఉత్సాహం నింపుతూ ఉంటాడు.

ఈడెన్‌గార్డెన్స్ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఓ పాటను హమ్ చేస్తూ స్టెప్స్‌ వేశాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ మూవీ జవాన్‌లోని పాపులర్ సాంగ్ ‘చలేయా’ను ఈడెన్‌గార్డెన్స్‌‌లో డీస్ ప్లే చేశారు. అది కాస్తా కోహ్లీ చెవిన పడడంతో హమ్ చేయకుండా ఉండలేకపోయాడు. చేతులు చాచి స్టెప్పులు వేశాడు. ఆ వెంటనే ఫీల్డింగ్ పొజిషన్‌లోకి వచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు కూడా హమ్ చేస్తూ హ్యాపీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Virat Kohli
Shah Rukh Khan
Jawan
Chaleya
Viral Videos

More Telugu News