కోహ్లీ బర్త్ డే... అనుష్క ఎలా విష్ చేసిందంటే...!
- భావోద్వేగంతో కూడిన పోస్ట్ తో విషెస్ తెలిపిన అనుష్క
- ఈ జీవితమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ వెల్లడి
- తన లైఫ్ లో కోహ్లీ ప్రాముఖ్యతను.. భర్తపై తనకున్న ప్రేమను చాటిచెప్పేలా పోస్ట్
తన జీవితంలో కోహ్లీ ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ అనుష్క ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తామిద్దరూ కలిసి ఉన్న ఫొటోను యాడ్ చేసింది. కోహ్లీ నిజంగా అసాధారణమైన వ్యక్తి అని కితాబిచ్చింది. కొడుకుగా, భర్తగా, తండ్రిగా.. అన్ని పాత్రలలోనూ అసాధారణమేనంటూ పొగిడింది. ఈ జన్మంతా.. ఆ తర్వాత కూడా నీపై నాకున్న ప్రేమకు అంతులేదంటూ అనుష్క పేర్కొంది.