ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం... బండి సంజయ్ మరోసారి పాదయాత్ర?
- పాదయాత్రకు అధిష్ఠానం నుంచి సూచనలు అందడంతో బండి సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కథనాలు
- కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో పాదయాత్ర
- ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ప్లాన్
ఈ పాదయాత్ర ఈ నెల 7వ తేదీన కరీంనగర్ పట్టణం నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలకు మరెంతో సమయం లేనందున కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడో తేదీన కరీంనగర్లో ప్రారంభమయ్యే పాదయాత్ర 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉండనుంది. బుల్లెట్ ప్రూఫ్ కారుతో ఆయన ప్రచారం చేయనున్నారు. మరోవైపు, తనకు అధిష్ఠానం కేటాయించిన హెలికాప్టర్‌తో ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారని చెబుతున్నారు.