Atchannaidu: చంద్రబాబుపై అక్రమ కేసులపైనే మొత్తం ధ్యాస: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on Jagan
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా కేబినెట్ భేటీలో కనీసం చర్చించలేదని విమర్శించారు. సీఎం జగన్ తన మొత్తం సమయాన్ని చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కరవు మండలాల ప్రకటనలో కూడా రైతులకు అన్యాయం చేశారని అన్నారు. కరవు మండలాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందన ఒక్క మండలం కూడా లేకపోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కరవు పరిహారాన్ని అందిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
YSRCP
Jagan

More Telugu News