ఏందయ్యా ఇది! సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ?.. ఆడేసుకుంటున్న అభిమానులు!
- ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం
- టెండూల్కర్ విగ్రహంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ ఛాయలు
- మీమ్స్‌తో విరుచుకుపడుతున్న అభిమానులు
- సెటైరికల్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న వైనం
దీనికి కారణం ఆ విగ్రహంలో సచిన్ పోలికలకు బదులు ఆసీస్ పరుగుల యంత్రం స్టీవ్‌స్మిత్ పోలికలు ఉండడమే. దీనిని గుర్తించిన అభిమానులు హనుమంతుడిని చేయబోతే కోతి అయినట్టుగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని షేర్ చేస్తూ సచిన్ అభిమానులు ఆడేసుకుంటున్నారు. వాంఖడేలో స్మిత్ విగ్రహం పెట్టినందుకు ప్రతిగా మెల్బోర్న్లో సచిన్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ సెటైర్లు వేస్తున్నారు.