ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదంటే..: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వివరణ
- కూటమి చీలిపోతుందనే ఆందోళనే కారణమన్న కాంగ్రెస్ చీఫ్
- గెలిచాక అన్ని పార్టీలతో చర్చించి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని వెల్లడి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వల్లే కూటమి మీటింగ్ లకు బ్రేక్
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమిలోని పార్టీల ప్రతినిధులు అంతా సమావేశమై ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఖర్గే చెప్పారు. కాగా, కొన్నిరోజులుగా ఇండియా కూటమిలో కదలిక కనిపించకపోవడానికి కారణం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలేనని ఖర్గే చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని వివరించారు. ఇదే విషయాన్ని కూటమి సభ్యులకు స్వయంగా వివరించి కొన్ని రోజుల పాటు భేటీని వాయిదా వేశామని తెలిపారు.