జగన్ పాలనలో మరో దారుణం చోటుచేసుకుంది: నారా లోకేశ్
- సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్న లోకేశ్
- దళిత యువకుడు శ్యామ్ కుమార్ ను శాడిస్టులు చిత్రహింసలకు గురి చేశారని మండిపాటు
- బాధ్యులైన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం... జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని చెప్పారు.