Advertisement

జగన్ పాలనలో మరో దారుణం చోటుచేసుకుంది: నారా లోకేశ్

Nara Lokesh fires on Jagan
  • సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్న లోకేశ్
  • దళిత యువకుడు శ్యామ్ కుమార్ ను శాడిస్టులు చిత్రహింసలకు గురి చేశారని మండిపాటు
  • బాధ్యులైన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా... తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసల పాల్జేయడమేగాక... దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని మండిపడ్డారు. 

జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం... జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని చెప్పారు.
Advertisement
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News