అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు ఎదురుదెబ్బ
- జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యం జరుగుతోందని రఘురాజు పిటిషన్
- విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం
- జగన్ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
విచారణ సందర్భంగా జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్ సహా కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.