ఒకే సీటు కేటాయిస్తే సీపీఐ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై?
- రేపు కూనంనేని అధ్యక్షతన సీపీఐ కార్యవర్గం భేటీ
- పొత్తు కుదరకుంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చ
- చెన్నూరు, కొత్తగూడెం కోరుతున్న సీపీఐ
కొత్తగూడెం సీపీఐలో ముసలం
కొత్తగూడెం సీపీఐలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఒకే సీటు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సీటును సాబిర్ పాషాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. సీట్ల కోసం అధిష్ఠానం అధికార పార్టీతో రాజీపడుతోందని వారు ఆరోపించారు. ఈ సీటును సాబిర్ పాషాకు ఇవ్వకుంటే అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు.