మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. కార్డియాక్ అరెస్ట్‌తో టీవీ నటి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. కార్డియాక్ అరెస్ట్‌తో టీవీ నటి మృతి

malayali tv actress dr priya passes away
  • గర్భవతి అయిన నటి ప్రియ డాక్టర్ చెకప్‌కు వెళ్లి అకస్మాత్తుగా మృతి
  • కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో దుర్మరణం
  • తక్షణం ఆపరేషన్ చేసి బిడ్డను వెలికితీసిన వైద్యులు
  • సోషల్ మీడియాలో ప్రియ సహనటుడి పోస్ట్
టీవీ నటి రెంజూష మేనన్ మరణవార్త మరువక మునుపే మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మరో టీవీ నటి ప్రియ (35) తాజాగా కన్నుమూశారు. ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆమె మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె సహ నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియాలో వెల్లడించారు. 

‘‘మలయాళీ టీవీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా మరొకరు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో ప్రియ కన్నుమూశారు. ఆమె ఎనిమిది నెలల ప్రెగ్నెంట్. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియ కార్డియాక్ అరెస్ట్‌కు గురై మరణించారు. అయితే, వైద్యులు తక్షణం స్పందించి శిశువును బయటకు తీశారు. ప్రస్తుతం శిశువు సురక్షితంగా ఉంది. చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసబ్యుల ఆవేదన నన్నెంతో కలచివేసింది. వాళ్లను ఎలా ఓదార్చాలో నాకు అర్థంకాలేదు. మంచి వాళ్లకు భగవంతుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేస్తాడో?’’ అంటూ ఆయన నెట్టింట పోస్ట్ పెట్టారు. 

వైద్య విద్య చదువుకున్న ప్రియ సీరియల్ నటిగా మలయాళంలో టీవీ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కరుతముత్తు అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పెళ్లి తరువాత ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు.
Advertisement
Dr.Priya
Mollywood

More Telugu News