తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..: జనతా కా మూడ్ సర్వే
- తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడి
- బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయన్న సర్వే
- కాంగ్రెస్ 31 నుంచి 36 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడి
బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 వరకు గెలుచుకుంటుందని వెల్లడించింది. బీజేపీ కేవలం 9 నుంచి 7 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఎంఐఎంకు 4 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే... బీఆర్ఎస్ కు 41 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 20 వేల శాంపిళ్లను తీసుకుని సర్వే చేసినట్టు వెల్లడించింది.