ఢిల్లీకి బయల్దేరిన నారా లోకేశ్
- కోర్టు కేసుల గురించి న్యాయ నిపుణులతో చర్చించనున్న లోకేశ్
- ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు
- 14 గంటలకు పైగా కొనసాగిన చంద్రబాబు ప్రయాణం
మరోవైపు, రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి ఉదయం 6 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. ప్రయాణం దాదాపు 14 గంటలకు పైగా కొనసాగింది. దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పలికారు. వాహనంపై పూలు చల్లుతూ తమ నాయకుడికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో కాన్వాయ్ విజయవాడలోకి ప్రవేశించింది. టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు స్వాగతం పలికారు.