Telugudesam: సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై మంగళవారం సాయంత్రం విడుదలైన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4:15 గంటల సమయంలో రాజమండ్రి నుండి బయలుదేరిన చంద్రబాబు దాదాపు 14.30 గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఇంటికి వెళ్లారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా చంద్రబాబు అలసిపోయారు. ఆయన ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్వేగానికి గురయ్యారు. ‘జై చంద్రబాబునాయుడు’, ‘లాంగ్ లివ్ చంద్రన్న’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

చంద్రబాబు నివాసానికి అమరావతి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టి తీసి అమరావతి మహిళలు నీరాజనాలు పట్టారు. స్వాగత కార్యక్రమాల్లో నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడికి దారిపొడవునా కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు.
Telugudesam
Andhra Pradesh

More Telugu News