మంత్రి గంగులకు చెందిన ప్రచార రథాన్ని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు

Teacher attack on Gangula campaign vehicle with chappal
  • ఎల్ఈడీ ప్రచార వాహనంపై దాడి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
  • కరీంనగర్‌లోని గోపాల్‌పూర్‌లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
  • కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు
మంత్రి గంగుల కమలాకర్ ప్రచారరథంపై మంగళవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పుతో దాడి చేసిన సంఘటన కరీంనగర్ నగరంలో చోటు చేసుకుంది. సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్‌కు చెందిన ఎల్ఈడీ ప్రచార వాహనం నగరంలోని గోపాల్‌పూర్‌లో తిరుగుతోంది.  ఈ సమయంలో ఉపాధ్యాయుడు జగదేశ్వర్ ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
gangula kamalakar
BRS
Telangana Assembly Election
Karimnagar District

More Telugu News