Elderly man: మాల్ లో మహిళలను ఉద్దేశపూర్వకంగా తాకుతూ వృద్ధుడి విపరీత చేష్టలు

Elderly man gropes multiple women inside Bengaluru Lulu mall FIR registered
  • బెంగళూరు లులూ మాల్ లో చోటు చేసుకున్న ఘటన
  • ఒంటరిగా ఉన్న మహిళలను అనుసరిస్తూ తాకుతున్న తీరు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బెంగళూరులోని లులూ మాల్ లో ఓ వృద్ధుడు మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ లోకి చేరడంతో వైరల్ గా మారింది. సదరు వృద్ధుడు ఒంటరిగా ఉన్న మహిళల వెనుక నుంచి సమీపంగా వచ్చి చేతులతో తడుముతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. దీనిపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

కావాలనే ఉద్దేశపూర్వకంగా మహిళ వెనుకగా వెళ్లి ఆమెను తాకడాన్ని గమనించొచ్చు. సదరు వృద్ధుడు కావాలనే ఆ విధంగా చేస్తున్నట్టు దీన్ని వీడియో తీసిన వ్యక్తి మీడియాకు చెప్పాడు. నా సోదరి అతడ్ని చూసి అనుమానాస్పదంగా ఉన్నట్టు నాతో చెప్పింది. యాధృచ్చికంగా జరిగిందని అనుకున్నాను. తర్వాత అతడిని అనుసరించాను. అతడు ఇతర మహిళల పట్ల కూడా అదే తీరులో వ్యవహరించడం కనిపించింది. ఆధారం కోసమే వీడియో తీశాను’’ అని వీడియో తీసిన వ్యక్తి వెల్లడించాడు. 

సదరు వృద్ధుడి గురించి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పగా, వీడియోలో ఉన్న వృద్ధుడిని వారు గుర్తించలేకపోయారు. దీనిపై మగాడీ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు వృద్ధుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేయడం కామెంట్ల రూపంలో కనిపిస్తోంది.                                                            

Elderly man
gropes WOMEN
Bengaluru
Lulu mall
VEDIO VIRAL

More Telugu News