Pawan Kalyan: చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు: పవన్ కల్యాణ్

Crores of people are waiting for Chandrababu says Pawan Kalyan
  • చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరమన్న పవన్ కల్యాణ్
  • ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్ష
  • అందరం చంద్రబాబును స్వాగతిద్దామని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... 'తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం' అని ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News