Chandrababu: రాజమండ్రి నుంచి అమరావతి వరకు ర్యాలీగా చంద్రబాబు.. రేపు తిరుమలకు పయనం!

Chandrababu to go to Amaravati from Rajahmundry as rally
  • చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
  • రాత్రికి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్న బాబు
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం 4 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయనకు స్వాగతం పలికేందుకు రాజమండ్రికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, అభిమానులు చేరుకుంటున్నారు. రాజమండ్రి జైలు నుంచి టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించనున్నాయి. మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి పాత హైవే మీదుగా అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా అమరావతిలోని ఉండవల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు. రేపు తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు.
Chandrababu
Telugudesam

More Telugu News