బీఎస్పీ నుంచి హిజ్రాకు వరంగల్ తూర్పు టికెట్.. సంబరాల్లో ట్రాన్స్జెండర్లు
- చిత్తారపు పుష్పిత లయకు టికెట్ కేటాయించిన బీఎస్పీ
- పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పుష్పిత
- తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానన్న లయ
బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పిత మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని, విద్యావంతురాలిగా తానేంటో నిరూపించుకుంటానని పేర్కొన్నారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.