ముఖేశ్ అంబానీకి మూడోసారి బెదిరింపులు.. ఈసారి రూ.400 కోట్లకు డిమాండ్
- నాలుగు రోజుల్లో మూడుసార్లు బెదిరింపు ఈమెయిల్స్
- అడిగినంత సొమ్ము ముట్టజెప్పకపోతే చంపేస్తామని హెచ్చరిక
- తమ దగ్గర దేశంలోనే బెస్ట్ షూటర్లు ఉన్నారని వార్నింగ్
గత వారం ముఖేశ్ అంబానీకి మొదటిసారి బెదిరింపు ఈమెయిల్ అందింది. ఇందులో దుండగులు రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుంటే అంబానీని చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ముఖేశ్ అంబానీ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖేశ్ కు, ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచారు. ఆ తర్వాత దుండగుల నుంచి మరోమారు బెదిరింపు లేఖ అందింది. అందులో రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు మెయిల్స్ పంపినా డబ్బు ఇవ్వలేదంటూ ఈసారి రూ.400 కోట్లు డిమాండ్ చేస్తూ దుండగులు తాజాగా మూడో ఈమెయిల్ పంపారు.