Afghanistan: పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్.. ఇలా జరిగితేనే సెమీస్‌కు ఛాన్స్!

  • నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్
  • శ్రీలంకపై విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరిన వైనం
  • ఆఫ్ఘనిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు మరింత మెరుగు
  • తదుపరి అన్ని మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్లు సాధిస్తే సెమీస్ బెర్తు ఖరారు
World Cup 2023 Points Table Afghanistan rise to fifth spot after thumping Sri Lanka in Pune

పసికూనగా వరల్డ్ కప్‌ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ తనను తక్కువగా అంచనా వేయొద్దని మరోసారి గట్టి సందేశాన్ని ఇచ్చింది. నిన్న పూణెలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై అద్భుత విజయంతో ఆరు పాయింట్లు సాధించిన ఆప్ఘనిస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. దీంతో, ఇప్పుడు అందరి దృష్టీ ఆఫ్ఘనిస్థాన్‌పైనే ఉంది. క్రికెట్ అభిమానుల్లో అనేక మంది ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఆఫ్ఘనిస్థాన్‌కు సెమీస్ ఛాన్సుందా? అంటే కచ్చితంగా ఉందని క్రీడానిపుణులు చెబుతున్నారు. రాబోయే మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవచ్చని అంటున్నారు. 

ఇలా జరిగితేనే ఆఫ్ఘనిస్థాన్‌కు సెమీస్ బెర్త్!
పరిశీలకుల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్ 12 పాయింట్లు సాధిస్తేనే సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌కు మరో మూడు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఒకటి ఆస్ట్రేలియాతో కాగా, మిగతా రెండు మ్యాచుల్లో వరుసగా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. ఇక సెమీస్‌లో ఆఫ్ఘన్ జట్టు కాలుపెట్టాలంటే ఈ మూడు మ్యాచుల్లో గెలవడంతో పాటూ ఆస్ట్రేలియాపై నికర రన్‌ రేటును మెరుగుపరుచుకోవాలి. ఇది జరిగితే, ఆస్ట్రేలియా తనకు మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచినా ఆఫ్ఘన్‌కు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 

ఇలా కాకుండా, ఆఫ్ఘనిస్థాన్ ఓ మ్యాచ్‌లో ఒడినట్టైతే పరిస్థితి కొంత జటిలమవుతుంది. ఆ తరువాత ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ తమకు మిగిలిన మ్యాచుల్లో కనీసం రెండింట్లో ఓడిపోతే గానీ ఆఫ్ఘన్‌కు బెర్తు ఖరారు కాదు. 

ఇక ఆఫ్ఘన్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గెలిచి ఆపై జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క దాంట్లో విజయం సాధించినా సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. అటుపై న్యూజిలాండ్, ఇండియాతో జరిగే మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఓటమి చవిచూస్తే ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌లో కాలుపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ తదుపరి ఏం చేయబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఆఫ్ఘనిస్థాన్ ఆడబోయే మ్యాచ్‌లు ఇవే

  • నవంబర్ 3- లక్నో- నెదర్లాండ్స్‌ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • నవంబర్ 7- ముంబై- ఆస్ట్రేలియాతో వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ 
  • నవంబర్ 10-అహ్మదాబాద్-దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్

More Telugu News