ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌పై రోహిత్ అసహనం.. ఈ వీడియో చూశారా?
- 22వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ ఎల్బీడబ్ల్యూకి రివ్యూ కోరని కుల్దీప్
- రీప్లేలో ఔట్ తేలడంతో ఆగ్రహించిన కెప్టెన్ రోహిత్
- సమాధానం లేక మౌనంగా ఉండిపోయిన కుల్దీప్ యాదవ్
ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 2 ముఖ్యమైన వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు. అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక సందర్భంలో కుల్దీప్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకంటే మ్యాచ్‌లో 22వ ఓవర్‌ను కుల్దీప్ వేశాడు. ఈ ఓవర్‌లో ఒక డెలివరీ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న లివింగ్‌స్టోన్ ప్యాడ్‌పై వికెట్ల ముందు తాకింది. అయితే దీనిపై టీమిండియా ఆటగాళ్లు పెద్దగా అప్పీల్ చేయలేదు. రివ్యూ కూడా కోరలేదు. అయితే తర్వాత గ్రౌండ్‌లోని బిగ్ స్ర్కిన్‌పై రీప్లేలో ఇది ఔట్‌గా తేలింది.
రీప్లేలో ఔట్‌గా తేలడాన్ని గమనించిన రోహిత్ శర్మ కుల్దీప్ వైపు నడిచివెళ్లాడు. రివ్యూ తీసుకోనందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రివ్యూ ఎందుకు కోరలేదన్నట్టుగా రుసరుసలాడాడు. జాగ్రత్తగా ఉండాలని, అతడు విజయాన్ని లాగేసుకోగలడని సూచించాడు. అయితే కుల్దీప్ దగ్గర సమాధానం లేకపోవడంతో ఏమీ మాట్లాడలేదు. తన స్థానంవైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.