Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ పై తాజా కబురు!

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం తెలిసిందే. బౌలింగ్ చేస్తూ జారిపడిన పాండ్యా కాలిమడమ గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రమైనది కావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ పై తాజా కబురు అందింది. 

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న పాండ్యా నవంబరు 2న శ్రీలంకతో జరిగే మ్యాచ్ కల్లా జట్టులో చేరతాడని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ముంబయిలో జట్టుతో కలుస్తాడని భారత క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే, హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, టీమిండియా ఎలాగూ సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న నేపథ్యంలో, నేరుగా సెమీస్ లో ఆడతాడని ఓ వార్త ప్రచారంలో ఉంది. 

పాండ్యా ఆల్ రౌండ్ సేవలు అందిస్తాడు కాబట్టి, అతడు జట్టులోకి వస్తే అదనంగా మరో బ్యాటర్ ను కానీ, బౌలర్ ను కానీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
Hardik Pandya
Injury
Fitness
Team India
World Cup

More Telugu News