చంపాపేట యువతి హత్య కేసులో ట్విస్ట్.. మాజీ ప్రియుడే చంపేశాడా?
- ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు
- ఇటీవలే ప్రేమ్ కుమార్ తో స్వప్నకు వివాహం
- మాజీ ప్రియుడితో కాంటాక్ట్ లో ఉన్న స్వప్న
తొలుత ఈ కేసును ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాక స్వప్న హత్యకు గురైందని నిర్ధారణకు వచ్చారు. స్వప్న, ప్రేమ్ కుమార్ ఉంటున్న గదిని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హత్యకు ఉపయోగించిన కత్తి లభించిందని సమాచారం. కాగా, శనివారం ఉదయం స్వప్న హత్య జరిగిన సమయంలో గదిలో ఆమెతో పాటు ప్రేమ్ కుమార్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అదే సమయంలో సతీశ్ తన మిత్రులతో కలిసి వచ్చి వారితో గొడవ పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వప్నను చంపేసి, ప్రేమ్ ను బంగ్లా పై నుంచి తోసేసి పారిపోయారని అంటున్నారు. ఇద్దరు యువకులు పారిపోతుండడం చూశామని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మరోవైపు, తన కూతురును ఎవరు చంపారు.. ఎందుకు చంపారో తెలియదని స్వప్న తండ్రి మోహన్ మీడియాకు తెలిపారు. పోలీసులు చెప్పాకే స్వప్న హత్య గురించి తనకు తెలిసిందని వివరించారు.